పార్టీని నమ్ముకుంటే అప్పుల పాలు చేశారు... మంత్రి రోజా ముందు వైసీపీ నేత నిరసన
- బుట్టిరెడ్డి కండ్రిగలో ఘటన
- భార్యతో కలిసి మంత్రి రోజా ముందు నిరసన
- రోడ్డు పనుల బిల్లులు విడుదల కాలేదని ఆవేదన
రోడ్డు నిర్మాణ పనులను సొంత ఖర్చులతో చేస్తే తమకు ఇప్పటిదాకా బిల్లులే మంజూరు కాలేదని గ్రామ మాజీ సర్పంచ్ తన భార్యతో కలిసి రోజా ముందు నిరసనకు దిగారు. వైసీపీని నమ్ముకుని తాము అప్పుల్లో కూరుకుపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ నేత మంత్రి ఎదుటే నిరసనకు దిగారు.