శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజీనామా... సింగపూర్ నుంచి లేఖ పంపిన వైనం
- ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
- దేశం నుంచి పారిపోయిన గొటబాయ
- మాల్దీవుల మీదుగా సింగపూర్ చేరుకున్న రాజపక్స
శ్రీలంకలో జనాగ్రహం పెల్లుబుకుతున్న వేళ వేలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించి అందులోకి ప్రవేశించారు. ఈ ఘటనకు ముందుగానే అధ్యక్ష భవనాన్ని వీడిన గొటబాయ... మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. చివరికి రాజపక్స సింగపూర్ చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.