శ్రీలంక ప్రధాని కుర్చీకి రక్షణగా మిలిటరీ!... వీడియో ఇదిగో!
- ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక
- ఇప్పటికే దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ
- ప్రధాని పదవికి రణిల్ రాజీనామా చేయాలంటున్న జనం
- ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని కార్యాలయం వద్ద సైనిక భద్రత
ఈ క్రమంలో అధ్యక్షుడి భవనం మాదిరే ప్రధాని మంత్రిత్వ కార్యాలయాన్ని కూడా జనం ఎక్కడ ముట్టడించి అందులోకి చొరబడతారోనన్న ఆందోళనతో ఆ దేశ సైన్యం అప్రమత్తమైంది. పీఎంఓ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్న లంక సైన్యం... ప్రధాని కార్యాలయంలో ప్రధాని కూర్చునే కుర్చీ చుట్టూ సైనికులను మోహరించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.