నాదెండ్ల మనోహర్ పర్యటనకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు: జనసేన
- కాకినాడ జిల్లాలో తమ కార్యక్రమాలను అడ్డుకున్నారన్న జనసేన
- నాదెండ్ల మనోహర్ ను అడ్డుకున్నారని విమర్శ
- ఇతర నేతలతో కలిసి రోడ్డుపై మనోహర్ బైఠాయించారని వెల్లడి
అయితే కాకినాడ సరిహద్దుల్లో ఆయన వాహన శ్రేణిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారని... దీన్ని గమనించిన మనోహర్ తూరంగి వద్ద తన వాహన శ్రేణిని నిలిపివేశారని జనసేన తెలిపింది. ఇతర నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మరోసారి దిగివచ్చి వాహనాలను వదిలేశారని తెలిపింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపట్ల నాదెండ్ల మనోహర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని వెల్లడించింది.