TSRTC: మల్లెల తీర్థం జలపాతానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీస్

TSRTC arranges bus service to Mallela Theertham waterfall
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఆర్టీసీ శ్రీశైలంలోని మల్లెల తీర్థానికి రోజువారీ ప్రత్యేక బస్సు సర్వీస్ ను ఆరంభించింది. ప్రతి రోజూ ఈ బస్సు సర్వీసు మల్లెల తీర్థం జలపాతానికి పర్యాటకులను తీసుకెళ్లనుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి ఈ సర్వీసు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది. అక్కడి నుంచి మళ్లీ 8.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.

అలాగే, ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు మరో సర్వీసు ఉంటుంది. ఇది కూడా సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరుతుంది. హైదరాబాద్ నుంచి మల్లెల తీర్థం 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. అచ్చంపేట నుంచే 55 కిలోమీటర్లు ఉండడం గమనార్హం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ జలపాతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. దీంతో వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
TSRTC
Bus service
Mallela Theertham
waterfall

More Telugu News