'గెహ్రాయియా' సినిమాలో దీపికా పదుకొణే చేసింది నేను 15 ఏళ్ల కిందటే చేశాను: మల్లికా షెరావత్ వ్యాఖ్యలు
- 'గెహ్రాయియా' సినిమాలో నటించిన దీపికా పదుకొణే
- బోల్డ్ గా నటించిన దీపిక
- తాను మర్డర్ సినిమాలో ఇలాగే నటించానన్న మల్లిక
- బాలీవుడ్ లో ఓ వర్గం తనను వేధిస్తోందని ఆవేదన
అంతేకాదు, బాలీవుడ్ లోని ఓ వర్గం తనను మానసిక వేదనకు గురిచేస్తోందని ఆరోపించింది. తన శరీరం గురించి, గ్లామర్ గురించి మాట్లాడతారే కానీ, తన నటనా సామర్థ్యాల గురించి మాట్లాడరని వాపోయింది. మొదట్లో హీరోయిన్లు సతీసావిత్రి టైపులో అతి మంచితనంతో ఉండేవారని, ఏమీ తెలియని అమాయకులో, లేక క్యారెక్టర్ లేని వ్యాంప్ లుగానే ఉండేవారని మల్లిక వివరించింది. నాటి హీరోయిన్ల కోసం ఈ రెండు తరహా పాత్రలే రాసేవారని పేర్కొంది.
కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని, స్త్రీలను కూడా మనుషుల్లా చూపిస్తున్నారని వెల్లడించారు. సంతోషమో, దుఃఖమో... తప్పులు చేస్తుందో, తప్పటడుగులు వేస్తుందో... కానీ అందరికీ ప్రేమకు పాత్రురాలవుతోందని ఇప్పటి హీరోయిన్ పాత్రలను మల్లిక విశ్లేషించింది.