'వినరో భాగ్యము విష్ణుకథ' నుంచి గ్లింప్స్ రెడీ!
- ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'వినరో భాగ్యము విష్ణు కథ'
- దర్శకుడిగా మురళీ కిశోర్ పరిచయం
- కశ్మీరకు తెలుగులో మొదటి సినిమా
- గట్టి నమ్మకంతో ఉన్న కిరణ్ అబ్బవరం
ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇక్కడి నుంచి ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ ఉంటాయని అనుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో కిరణ్ అబ్బవరానికి వరుస ఫ్లాపులు పడుతున్నాయి. పెద్ద బ్యానర్ .. మంచి కథ.. ఆకట్టుకునే టైటిల్.. ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్.. అందువలన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. కొత్త కథానాయికకు ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.