ఇంగ్లండ్‌లోనే ధోనీ!... విండీస్ దిగ్గజంతో కలిసి నిన్నటి వన్డే మ్యాచ్ వీక్షణ!
- చాలా రోజుల క్రితమే ఇంగ్లండ్ టూర్ వెళ్లిన ధోనీ
- బర్త్ డే వేడుకలను కూడా అక్కడే జరుపుకున్న వైనం
- నిన్నటి మ్యాచ్‌ను గార్డన్ గ్రీనిడ్జ్‌తో కలిసి వీక్షించిన కెప్టెన్ కూల్
- సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులూ ధోనీకి జత కలిసిన వైనం
ఈ సందర్భంగా గ్రీనిడ్జ్‌తో ధోనీ దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. సైఫ్ అలీ ఖాన్, అతడి భార్య కరీనా కపూర్, గ్రీనిడ్జ్‌లతో కలిసి ధోని నిన్నటి మ్యాచ్‌ను వీక్షించాడట. ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ కనిపించిన ధోనీ...ఇంగ్లండ్ వేదికగా ఇటీవలే ముగిసిన వింబుల్డన్ మ్యాచ్‌ల్లోనూ తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే.