తెలంగాణలో తాజాగా 562 మందికి కరోనా
- రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 27,249 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 329 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 616 మంది
- ఇంకా 5,112 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,07,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,97,911 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,112 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది కన్నుమూశారు.
