విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు డీకే అరుణ అభినంద‌నలు

bjp leader dk aruna greets KV Vijayendra Prasad
  • రాజ్య‌స‌భ‌కు ఎంపికైన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌
  • సోమ‌వారం క‌థా ర‌చ‌యిత‌ను అభినందించిన‌ కె.ల‌క్ష్మణ్
  • రాజ్య‌స‌భ‌లో మెరుగ్గా రాణించాల‌ని ఆకాంక్షించిన డీకే అరుణ‌
రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎంపికైన టాలీవుడ్ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు ఆయా పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. సోమ‌వారం బీజేపీ సీనియ‌ర్ నేత కె.లక్ష్మ‌ణ్ స్వ‌యంగా వ‌చ్చి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు అభినంద‌న‌లు తెలిపారు. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ కూడా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని విజ‌యేంద్ర ప్ర‌సాద్ నివాసానికి వ‌చ్చిన డీకే అరుణ‌.. ఆయ‌నకు అభినంద‌న‌లు తెలిపారు. రాజ్య‌స‌భ‌లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌రిచేలా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు జోగులాంబ ఆశీస్సులు ఉంటాయ‌ని ఈ సంద‌ర్భంగా డీకే అరుణ తెలిపారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్న ఫొటోల‌ను డీకే అరుణ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Go Back to Shorts
DK Aruna
BJP
KV Vijayendra Prasad
Rajya Sabha

More Telugu News