England: ఇంగ్లండ్‌తో తొలి వ‌న్డే... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

rohit sharma wins the toss and elected to bowl first
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్‌తో 3 వ‌న్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సార‌థి రోహిత్ శ‌ర్మ‌... తొలుత ఫీల్డింగ్ చేయాల‌ని నిర్ణ‌యించాడు. ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్‌ను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లండ‌న్‌లోని ఓవ‌ల్ స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

లండ‌న్ టూర్‌లో ఐదో టెస్టు మ్యాచ్‌లో బోల్తా ప‌డిన టీమిండియా టీ20 సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల‌ను నెగ్గిన టీమిండియా అనూహ్యంగా మూడో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తాజాగా 3 మ్యాచ్‌లతో కూడిన వ‌న్డే సిరీస్‌ను అయినా చేజిక్కించుకోవాల‌న్న క‌సితో ఉన్న ఇంగ్లండ్ జ‌ట్టును ఎలాగైనా క‌ట్ట‌డి చేయాల్సిందేన‌న్న దిశ‌గా టీమిండియా బ‌రిలోకి దిగుతోంది.
Go Back to Shorts
England
Team India
London
The Oval
Rohit Sharma

More Telugu News