పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 147 మంది మృత్యువాత
- పాకిస్థాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
- చనిపోయిన వారిలో 88 మహిళలు, చిన్నారులు
- వాతావరణ మార్పులే అధిక వర్షాలకు కారణమంటున్న నిపుణులు
వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయని, ఈ సమయంలో వాహనాల కంటే బోట్లే అవసరమని బాధితులు చెబుతున్నారు. నీట మునిగిన కార్లను రోడ్లపైనే వదిలేసినట్టు చెప్పారు. బెలూచిస్థాన్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 63 మంది వర్షాల కారణంగా మృతి చెందారు. సింధు ప్రావిన్స్ రాజధాని కరాచీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఇస్లామాబాద్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వాతావరణ మార్పులే భారీ వర్షాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.