నీతి ఆయోగ్ సీఈఓగా పరమ్ అయ్యర్ పదవీ బాధ్యతల స్వీకారం
- 1981 బ్యాచ్ యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయ్యర్
- స్వచ్ఛ భారత్ మిషన్లో విశేష పనితీరు కనబరచిన వైనం
- ఢిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓగా బాధ్యత స్వీకరణ
1981 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన పరమ్ అయ్యర్ ఉత్తరప్రదేశ్ కేడర్లో పనిచేశారు. ఇదివరకే కేంద్ర సర్వీసుల్లో చేరిపోయిన ఆయన మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్లో విశేషంగా రాణించారు. గ్రామీణ భారతంలో 9 కోట్ల వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం జరిగేలా ఆయన విశేష పనితీరును చాటారు.