జలపాతం కింద పడకుండానే ఆవిరిగా మారిపోతే!... అలాంటి ప్రకృతి సోయగం వీడియో ఇదిగో!
- పశ్చిమ కనుమల్లోని నానేఘాట్లో అరుదైన దృశ్యం
- జల ధార మధ్యలోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళుతున్న వైనం
- వీడియోను పంచుకున్న ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద
పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ ప్రాంతంలో కనిపించిన ఈ దృశ్యంలో కొండ పై నుంచి కిందకు జారుతున్న జల ధార అలా మధ్యలోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళుతోంది. వాయువేగం అన్నది భూమి గురుత్వాకర్షణ శక్తికి సరిసమానంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని సుశాంత నంద వెల్లడించారు.