Andhra Pradesh: ప‌య్యావుల కేశవ్‌కు భ‌ద్ర‌త పున‌రుద్ధ‌ర‌ణ‌

ap governmenr reinstate security to payyavula keshav
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఉవ‌ర‌కొండ ఎమ్మెల్యే, ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ (పీఏసీ) అధ్య‌క్షుడు ప‌య్యావుల కేశ‌వ్‌కు భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వం వెనక్కు తీసుకుంది. గ‌తంలో ఏ స్థాయిలో అయితే కేశవ్‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారో... అదే త‌ర‌హాలో భ‌ద్ర‌త‌ను పున‌రుద్ధ‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

టీడీపీ ఎమ్మెల్యేగానే కాకుండా పీఏసీ చైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌య్యావుల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌య్యావుల‌కు సెక్యూరిటీగా ప‌నిచేస్తున్న గ‌న్‌మెన్ల‌ను సోమ‌వారం ఉద‌యం వెన‌క్కు పిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌య్యావుల‌కు భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌నూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప‌లువురు పోస్టులు పెట్టారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది.

అయితే, ప‌య్యావుల‌కు భ‌ద్ర‌త‌గా ప‌నిచేస్తున్న గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కు పిలిచిన ప్ర‌భుత్వం... వారి స్థానంలో కొత్త గ‌న్‌మెన్ల‌ను నియ‌మించింది. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టిదాకా త‌న‌కేమీ స‌మాచారం లేద‌ని ప‌య్యావుల పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
Go Back to Shorts
Andhra Pradesh
TDP
Payyavula Keshav
PAC Chairman
YSRCP
Security

More Telugu News