వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎలీనా రైబాకినా
- ఫైనల్లో ఆన్స్ జాబెర్ పై విజయం
- తొలి సెట్ ను కోల్పోయినా పోరాడిన రైబాకినా
- కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ కైవసం
ఈ టైటిల్ సమరంలో తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ రైబాకినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆడింది. వరుసగా రెండు సెట్లలో గెలిచి మ్యాచ్ ను, చాంపియన్ షిప్ ను నెగ్గింది. కాగా, వింబుల్డన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ సమరం రేపు (జులై 10) జరగనుంది. ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జకోవిచ్ తో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ తలపడనున్నాడు.