రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీమిండియాకు మొదట బ్యాటింగ్
- తొలి టీ20లో టీమిండియా విజయం
- నేడు బర్మింగ్ హామ్ లో రెండో మ్యాచ్
- టీమిండియా గెలిస్తే సిరీస్ వశం
- జట్టులోకి వచ్చిన కోహ్లీ, బుమ్రా, జడేజా
మాజీ కెప్టెన్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. తొలి టీ20లో తన బౌలింగ్ తో ఆకట్టుకున్న యువ పేసర్ అర్షదీప్ సింగ్ ను ఈ మ్యాచ్ కు పక్కనబెట్టారు.
ఇక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. రీస్ టాప్లే, టైమల్ మిల్స్ స్థానంలో డేవిడ్ విల్లీ, రిచర్డ్ గ్లీసన్ జట్టులోకి వచ్చారని వివరించాడు.