షారుక్ ను ఢీ కొట్టబోతున్న విజయ్ సేతుపతి!

Jawan Movie Update
  • తమిళనాట బిజీ ఆర్టిస్ట్ గా విజయ్ సేతుపతి 
  • హీరోగాను .. విలన్ గాను మెప్పిస్తున్న నటుడు 
  • 'పుష్ప 2' నుంచి వెళ్లిన అవకాశం 
  • 'జవాన్' సినిమా నుంచి వచ్చిన పిలుపు 
ఒక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా తమిళనాట విజయ్ సేతుపతి దూసుకుపోతున్నాడు. ఆ మధ్య 'ఉప్పెన'లో ఆయన చేసిన  పాత్ర .. ఇటీవల 'విక్రమ్' సినిమాలో చేసిన పాత్ర ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' లోను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర కోసం ఆయనను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమా 'జవాన్' నుంచి కూడా  ఆయనకి పిలుపు వచ్చినట్టుగా చెబుతున్నారు. హిందీలో షారుక్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్ ఉందట.

ఈ పాత్రకి విజయ్ సేతుపతి అయితే బాగుంటాడని షారుక్ ను అట్లీ కుమార్ ఒప్పించినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అవుతాడని అంటున్నారు. ఈ సినిమాతో విజయ్ సేతుపతి రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయనతార .. సాన్య మల్హోత్రా .. ప్రియమణి  ముఖ్యమైన  పాత్రల్లో కనిపించనున్నారు.
Go Back to Shorts
Sharukh Khan
Natanatara
Atlee Kumar
Jawan Movie

More Telugu News