పెన్ను పోగొట్టుకున్న తమిళనాడు ఎంపీ.. పోలీసులకు ఫిర్యాదు

Congress Vijay Vasanth MP pen missing police registered complaint
  • రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత కార్యక్రమంలో పెన్ను పోయిందని ఫిర్యాదు
  • దాని విలువ రూ. 1.50 లక్షలని ఫిర్యాదులో పేర్కొన్న ఎంపీ
  • దానిని తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్నానని వెల్లడి
తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పెన్ను విలువ అక్షరాలా లక్షా యాభైవేల రూపాయలని, అది తన తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చిన కలమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఎన్నికల్లో మద్దతు కోరేందుకు చెన్నై వచ్చారు. 

ఈ సందర్భంగా  గిండీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో స్వాగతం పలికిన సమయంలో ఆ పెన్నును ఎవరో దొంగిలించారని పేర్కొన్నారు. ఆ పెన్నును తన తండ్రి తనకు బహుమతిగా ఇచ్చారని, కాబట్టి అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఎంపీ విజయ్ వసంత్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Congress
Vijay Vasanth
Kanyakumari
Pen

More Telugu News