ఇక్కడ రాక్షసుడైనా .. భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే: ట్రైలర్ రిలీజ్

Bimbisara movie trailer released
షార్ట్స్‌లో చూడండి
కల్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' రూపొందింది. తన సొంత బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని కీరవాణి అందించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"వర్తమానంలోను .. గతంలోను ఈ కథ నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'బింబిసార' ధోరణి ఎలా ఉండేది .. ఆయన కాలంతో ముడిపడిన నిధిని ఈ కాలంలో చేజిక్కించుకోవాలనుకున్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే ప్రధానమైన కథగా కనిపిస్తోంది.

'ఇక్కడ రాక్షసుడైనా .. భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' అనే డైలాగ్, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. కేథరిన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు
Go Back to Shorts
kalyanran
Catherine
Bimbisara Movie

More Telugu News