కరోనా నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. నెట్స్ లో కఠోర సాధన!
- ఇటీవల కరోనా బారిన పడిన రోహిత్ శర్మ
- తాజా టెస్టుల్లో నెగెటివ్ అని తేలిన వైనం
- వైట్ బాల్ మ్యాచ్ లకు సిద్ధమవుతున్నాడన్న బీసీసీఐ
లీసెష్టర్ షైర్ తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రోహిత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ బ్యాటింగ్ కు దిగలేదు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకోవడంతో ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్ తో జరిగే తొలి టీ20కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలను టీమిండియా ఆడబోతోంది.