తెలంగాణలో కమల వికాసమే..: యోగి ఆదిత్యనాథ్
- ఆ రోజులు త్వరలోనే వస్తాయి
- టీఆర్‌ఎస్ ప్రభుత్వ అరాచకాలను ఎదిరించాలి
- బీజేపీని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి
- యూపీలో డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి
టీఆర్‌ఎస్ కుట్రలను అడ్డుకోవాలి
రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ కుట్రలకు పాల్పడుతోందని.. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు బుద్ధి చెప్పినట్టుగా, మళ్లీ తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటంతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదల కోసం 45 లక్షల ఇళ్లు కట్టించామని.. ఆ రాష్ట్రంలో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా సంక్షోభంలో 15 కోట్ల మందికి నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్ బియ్యం అందించామన్నారు.