Narendra Modi: కాసేపట్లో హైదరాబాద్‌ సభలో పాల్గొనబోతున్నానంటూ మోదీ ట్వీట్‌

Modi tweets that he will attend Hyderabad rally shortly
  • కేంద్ర అభివృద్ధికి అంతా ఆకర్షితులు అవుతున్నారన్న మోదీ
  • అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని వెల్లడి 
  • సంక్షేమ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని సంతోషం 
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పట్ల అంతా ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. 

ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతతోపాటు బలహీన వర్గాలకు మేలు జరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. కాసేపట్లో హైదరాబాద్‌లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరవుతున్నానంటూ ట్విట్టర్‌ లో ట్వీట్‌ చేశారు.
Narendra Modi
Tweet
Hyderabad
BJP

More Telugu News