Narendra Modi: సభకు భారీ జనం రావడం పట్ల బండి సంజయ్ ని అభినందించిన ప్రధాని మోదీ

PM Modi appreciates Telangana BJP Chief Bandi Sanjay
  • సికింద్రాబాద్ లో బీజేపీ విజయ్ సంకల్ప సభ
  • హాజరైన ప్రధాని మోదీ
  • భారీగా తరలివచ్చిన జనసందోహం
  • మోదీని దేవుడంటూ ఆకాశానికెత్తిన బండి సంజయ్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తలపెట్టిన విజయ్ సంకల్ప సభ ప్రారంభమైంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభకు వచ్చిన భారీ జనసమూహాన్ని చూసి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అభినందించారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. "నా మోదీ దేవుడన్నా ... దేవుడన్నా నా మోదీ" అంటూ వ్యాఖ్యానించారు. పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పులి (మోదీ)ని స్వాగతిస్తారని, కానీ ఈ టీఆర్ఎస్ దద్దమ్మలకు, కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోదీ విలువ తెలియదన్నా అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 

తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ పాలన వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని బండి సంజయ్ ఉద్ఘాటించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం బాధగా ఉందని అన్నారు. మోదీని ఎందుకు తిడుతున్నారో చెప్పాలని నిలదీశారు. పేదలకు ఉచితం బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నారా? పేదలకు ఉచితంగా కరోనా టీకాలు ఇచ్చినందుకు తిడుతున్నారా? ఉక్రెయిన్ నుంచి ఒక్క మాటతో విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చినందుకు తిడుతున్నారా? ఎందుకు తిడుతున్నారు? అంటూ టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ మండిపడ్డారు.
Narendra Modi
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News