జనసేన జనవాణి ప్రారంభం.. సమస్యలతో పోటెత్తిన జనం
- విజయవాడలోని మాకినేని భవన్లో ప్రారంభించిన పవన్
- జనం నుంచి సమస్యలను వింటున్న జనసేనాని
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం
జనవాణి కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనున్నారు. దాదాపుగా 5 గంటల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో జనం సమస్యలపై పవన్ స్పందించనున్నారు. ఆయా సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగంతో పాటు వైసీపీ ప్రభుత్వానికి పలు సూచనలతో పాటు హెచ్చరికలు జారీ చేయనున్నారు.