బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకనున్న కేసీఆర్
- కాసేపట్లో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కానున్న సిన్హా
- జలవిహార్ వరకు ర్యాలీగా వెళ్లనున్న కేసీఆర్, సిన్హా
అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి కేసీఆర్, యశ్వంత్ సిన్హా ర్యాలీగా నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు చేరుకోనున్నారు. దాదాపు వెయ్యి బైక్ లతో ర్యాలీ జరగనుంది. జలవిహార్ లో ఇరువురూ చర్చలు జరపనున్నారు. కేసీఆర్, సిన్హా ఇద్దరూ మధ్యాహ్నం అక్కడే భోజనం చేయనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు.