Auditions: అల్లు అర్జున్ సినిమాలో నటించే గోల్డెన్ చాన్స్ మీదే కావొచ్చు... వివరాలు ఇవిగో! (చిత్తూరు యాస తప్పనిసరి)

Auditions announced for Allu Arjun next venture Pusha The Rule
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తిరుగులేని హిట్ గా నిలిచిపోయే చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. పుష్ప ది రూల్ పేరిట వస్తున్న ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆడిషన్స్ ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా మేల్, ఫిమేల్, చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. తిరుపతిలో జులై 3, 4, 5 తేదీల్లో నటీనటులకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు తెలిపింది. 

తిరుపతి నగరంలోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ (న్యూ బాలాజీ కాలనీ) వేదికగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వకు ఆడిషన్స్ ఉంటాయని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. అయితే, ఆడిషన్స్ కు వచ్చేవారికి ఓ షరతు విధించింది. చిత్తూరు యాస తప్పనిసరి అని స్పష్టం చేసింది.
Go Back to Shorts
Auditions
Pushpa The Rule
Allu Arjun
Tirupati
Mythri Movie Makers

More Telugu News