Manchu Lakshmi: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది: మంచు లక్ష్మి

Manchu Lakshmi and Mohan Babu acting in one film
షార్ట్స్‌లో చూడండి
తన తండ్రి మోహన్ బాబుతో కలిసి 'అగ్ని నక్షత్రం' సినిమా చేస్తున్నానని సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందని చెప్పారు. తన తండ్రిలో కలిసి నటించడమే కాకుండా, ఆయనతో కలిసి ఆ సినిమాను కూడా నిర్మిస్తున్నానని చెప్పారు. తమ చిత్రానికి 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్ ని ఖరారు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నామని అన్నారు. 

'సన్నాఫ్ ఇండియా' సినిమా తర్వాత మోహన్ బాబు నటిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. ప్రతీక్ ప్రజోశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రత్యర్థులుగా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 'పిట్టకథలు' వెబ్ సరీస్ తర్వాత మంచు లక్ష్మి నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
Go Back to Shorts
Manchu Lakshmi
Mohan Babu
Tollywood
Agni Nakshatram

More Telugu News