CM KCR: బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR wishes Telangana people on Bonalu festival
  • తెలంగాణలో బోనాల సీజన్ షురూ
  • గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం
  • రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్న సీఎం కేసీఆర్
  • తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటే పండుగ అని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ నేడు ఘనంగా ప్రారంభమైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని కేసీఆర్ అన్నారు.  

తెలంగాణ సబ్బండ వర్గాల సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిధ్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
CM KCR
Bonalu
State Festival
Telangana

More Telugu News