YSRCP: లాగే గుర్ర‌మేదో, త‌న్నే గుర్ర‌మేదో గ్ర‌హించండి... వైవీ సుబ్బారెడ్డికి వాసుప‌ల్లి గ‌ణేశ్ వేడుకోలు

vizag south mla vasupalli comments in party plenary
  • విశాఖ‌లో వైసీపీ ప్లీన‌రీ
  • హాజ‌రైన రీజ‌నల్ కో ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి
  • వైవీ ఎదుటే అసంతృప్తి వ్య‌క్తం చేసిన వాసుప‌ల్లి
  • త‌న్నే వాళ్లు పైర‌వీలు చేసుకుంటున్నార‌ని ఫిర్యాదు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీలను నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విశాఖ‌లో జ‌రిగిన ప్లీన‌రీలో విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యేగా ఉన్న వాసుప‌ల్లి గ‌ణేశ్ కుమార్ త‌న ఆవేద‌న‌ను పార్టీ సీనియ‌ర్ నేత‌, విశాఖ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి ముందే వెళ్ల‌గ‌క్కారు.

పార్టీలో లాగే వాళ్లు లాగుతుంటే... త‌న్నే వాళ్లు మాత్రం పైర‌వీలు చేయించుకుంటున్నార‌ని గ‌ణేశ్ అన్నారు. అంతేకాకుండా లాగే గుర్ర‌మేదో, త‌న్నే గుర్ర‌మేదో గ్ర‌హించాల‌ని కూడా వైవీ సుబ్బారెడ్డికి సూచించారు. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి వెంట‌నే క‌ల్పించుకున్నారు. కొంద‌రు కార్య‌క‌ర్త‌ల్లో అసంతృప్తి నిజ‌మేన‌న్న వైవీ... భ‌విష్య‌త్తులో అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని భ‌రోసా ఇచ్చారు.
YSRCP
Vasupalli Ganesh Kumar
Vizag
YV Subba Reddy

More Telugu News