హైటెన్షన్ వైర్లపై ఉడుత పడింది... అందుకే తీగలు తెగి ఆటోపై పడ్డాయి: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు వివరణ
- శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం
- హైటెన్షన్ వైర్లు తెగి పడి ఆటో దగ్ధం
- ఐదుగురు మహిళలు సజీవదహనం
- ఉడుత కారణంగా షార్ట్ సర్క్యూట్ అయినట్టు గుర్తింపు
ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటిండెంట్ ఇంజినీర్ కు ఆదేశాలు జారీ చేసినట్టు హరినాథరావు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు విద్యుత్ శాఖ తరఫున రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున తక్షణ ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించినట్టు వివరించారు.