అమెరికా అధ్యక్షుడితో చర్చించే కంటే వెళ్లి హాకీ ఆడుకుంటా..!: రష్యా అధ్యక్షుడు పుతిన్
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్య
- ఉక్రెయిన్ పై దాడికి ముందు నాటి ఫోన్ సంభాషణ బయటికి వెల్లడి
- ఈ తీరుతోనే ప్రపంచం గందరగోళంలో పడిందనే అభిప్రాయాలు
గత ఫిబ్రవరిలో చర్చ సందర్భంగా..
ఉక్రెయిన్ పై రష్యా దాడికి సిద్ధమైనప్పుడు యుద్ధాన్ని నివారించడానికి పలు దేశాల అధినేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా పుతిన్ కు ఫోన్ చేసి 9 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చించాలని సూచించారు. దీనిపై స్పందించిన పుతిన్.. ‘అమెరికా అధ్యక్షుడితో మాట్లాడే కంటే వెళ్లి ఐస్ హాకీ ఆడుకుంటా..’ అని వ్యాఖ్యానించినట్టు తాజాగా వెల్లడైంది. దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ డాక్యుమెంటరీని విడుదల చేసింది.