తెలుగు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులకు విందు ఇచ్చిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కోసం చండీగఢ్ వెళ్లిన ఆర్థిక మంత్రులు
- రాజేంద్రనాథ్, హరీశ్‌లను విందుకు ఆహ్వానించిన దత్తాత్రేయ
- ట్విట్టర్లో ఫొటోలను షేర్ చేసిన హర్యానా గవర్నర్
ఈ సందర్భంగా ఇద్దరు ఆర్థిక మంత్రులను దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. ఇద్దరు మంత్రులకు ఆయన జ్ఞాపికలను కూడా అందజేశారు. ఈ విషయాన్ని దత్తాత్రేయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులను సన్మానించడం తనకు సంతోషాన్నిచ్చిందని దత్తాత్రేయ సదరు ట్వీట్లో పేర్కొన్నారు.