అమ‌రావ‌తిలో ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి ర‌ద్దు... రేప‌టిలోగా ఫ్లాట్ల‌ను ఖాళీ చేయాలంటూ ప్ర‌భుత్వం ఆదేశం

ap government cancels free accomodation to employees in amaravati
రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఏపీ సర్కారు బుధ‌వారం భారీ షాకిచ్చింది. రాజ‌ధాని అమ‌రావతి ప‌రిధిలో ఉద్యోగుల‌కు క‌ల్పిస్తున్న ఉచిత వ‌స‌తిని ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రేప‌టిలోగా ఫ్లాట్ల‌ను ఖాళీ చేయాల‌ని కూడా స‌ద‌రు ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీ చేసింది. 

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ నుంచే పాల‌న సాగించాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న నాటి టీడీపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను అమ‌రావ‌తికి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తి వ‌చ్చిన ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి క‌ల్పించింది. వారానికి 5 రోజుల ప‌ని విధానాన్ని అమ‌లు చేసింది. తాజాగా ఈ ఉచిత వ‌స‌తిని వైసీపీ స‌ర్కారు ర‌ద్దు చేసింది. అంతేకాకుండా ఇప్ప‌టిదాకా ఉంటున్న ఫ్లాట్ల‌ను మంచి స్థితిలోనే అప్ప‌జెప్పాల‌ని ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆయా ఫ్లాట్ల‌కు ఏదైనా న‌ష్టం జ‌రిగి ఉంటే దానికి ఉద్యోగులే బాధ్య‌త వ‌హించాలని కూడా త‌న ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Amaravati
Employees

More Telugu News