నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20.. వాన దేవుడు కరుణిస్తేనే ఆట
- తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
- రెండో మ్యాచ్ లో శాంసన్, త్రిపాఠి, అర్షదీప్ లకు అవకాశం ఇచ్చే యోచన
- రాత్రి 9 గంటల నుంచి మ్యాచ్
ఇక, ఐపీఎల్లో అయిన గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ సూర్య కుమార్ తొలి టీ20లో డకౌటై నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో రెండో పోరులో ఎలాగైనా బ్యాట్ ఝుళిపించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఇక, తన అరంగేట్రం మ్యాచ్ లో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నాడు. అయినప్పటికీ అతనిపై కెప్టెన్ హార్దిక్ భరోసా ఉంచాడు. ఉమ్రాన్ ఈ మ్యాచ్‌లోనూ ఆడటం ఖాయమే కాబట్టి దాన్ని అతను సద్వినియోగం చేసుకోవాలి.
ఇక, తొలి మ్యాచ్ లో నిరాశ పరిచిన అవేశ్ ఖాన్ స్థానంలో మరో యువ పేసర్ అర్షదీప్‌ను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ లో పంజాబ్ తరఫున అతను ఆకట్టుకున్నాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించిన ఐర్లాండ్ ఈసారి బౌలింగ్ లోనూ సత్తా చాటి సిరీస్ సమం చేయాలని అనుకుంటోంది. ఇక తొలి మ్యాచ్ మాదిరిగానే రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ సజావుగా జరుగుతుందో లేదో చూడాలి.