Andhra Pradesh: ఆ మూడూ ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ!... పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీఐఐసీ ఆఫ‌ర్‌!

apiic new offer to industrialists in ap
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పిన పారిశ్రామిక‌వేత్త‌ల‌కు సోమ‌వారం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన పాత బ‌కాయిల‌తో పాటు వ‌డ్డీ, ఆస్తి ప‌న్ను... ఈ మూడింటిని ఒకేసారి చెల్లిస్తే... ఆ మొత్తంలో నుంచి 5 శాతాన్ని రాయితీగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే జులై 31లోగా చెల్లించిన వారికే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుందంటూ ప్ర‌భుత్వం ఓ ష‌ర‌తు విధించింది. 

ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వంలో అంతర్భాగ‌మైన ఏపీఐఐసీ సోమ‌వారం సాయంత్రం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీఐఐసీ పిలుపునిచ్చింది. ఈ స‌రికొత్త ప‌థ‌కంపై అప్పుడే విపక్షాలు విమర్శ‌లు గుప్పించాయి. ఆదాయ వ‌న‌రుల‌ను పెంచుకునేందుకే ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని విప‌క్షాలు ఆరోపించాయి.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
APIIC

More Telugu News