Sachin Pilot: గతంలో నన్ను 'చవట' అన్నారు, 'దద్దమ్మ' అన్నారు... నేను పట్టించుకోలేదు: గెహ్లాట్ తో వివాదంపై సచిన్ పైలట్

Sachin Pilot recalls Ashok Gehlot comments
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం మహారాష్ట్రలో ఎలాంటి సంక్షోభం అయితే నడుస్తోందో, గతంలో రాజస్థాన్ లోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. రెండేళ్ల కిందట కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ సీఎం అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే ఆ సంక్షోభం కొద్దికాలంలోనే సమసిపోయింది. అయితే, ఆనాడు అశోక్ గెహ్లాట్ తనను ఏమన్నాడో తాజాగా సచిన్ పైలట్ గుర్తుచేసుకున్నారు. 

తనను చవట అన్నారని, దద్దమ్మ అన్నారని వెల్లడించారు. కానీ అశోక్ గెహ్లాట్ ఎంతో అనుభవం ఉన్న సీనియర్ రాజకీయవేత్త అని తెలిపారు. తండ్రి లాంటి వ్యక్తిగా భావించి అశోక్ గెహ్లాట్ ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదని పైలట్ స్పష్టం చేశారు. 2020లో తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సచిన్ పైలట్ చేయి కలిపాడన్న సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సచిన్ పైలెట్ పైవిధంగా బదులిచ్చారు.
Go Back to Shorts
Sachin Pilot
Ashok Gehlot
Congress
Rajasthan

More Telugu News