జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులను గుర్తించిన బాధితురాలు
- గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులు
- చంచల్‌గూడ జైలులో ఉన్న సాదుద్దీన్
- జువెనైల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు
- న్యాయమూర్తి, పోలీసుల సమక్షంలో నిందితుల గుర్తింపు
- బాధితురాలు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు
ఈ మేరకు నిందితుల గుర్తింపు ప్రక్రియను సోమవారం పోలీసులు చేపట్టగా... చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయమూర్తి సమక్షంలోనే నిందితులను గుర్తించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు బాధితురాలు వివరంగానే సమాధానమిచ్చింది. ఈ వివరాలన్నింటినీ పోలీసులు నమోదు చేసుకున్నారు. ఈ వివరాలను వారు కోర్టుకు అందజేయనున్నారు.