దురదృష్టవశాత్తు పాక్ లో ధోనీ వంటి వ్యక్తులు లేరు... ఒకరు బాగా ఆడితే మా సీనియర్లు ఓర్వలేరు: పాక్ ఆటగాడు షేజాద్
- పాక్ జట్టులో స్థానం కోల్పోయిన షేజాద్
- రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే జట్టు నుంచి తప్పించారని వెల్లడి
- దేశవాళీల్లో రాణించినా చోటివ్వలేదని ఆరోపణ
జాతీయ జట్టులో స్థానం కోల్పోయాక దేశవాళీ క్రికెట్ ఆడమన్నారని, తాను విశేషంగా రాణించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచినా మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదని షేజాద్ ఆరోపించాడు. కోహ్లీ వంటి ఆటగాళ్లకు ధోనీ ఎంతగానో మద్దతు ఇచ్చేవాడని, కానీ పాకిస్థాన్ లో అలాంటి పరిస్థితి లేదని తెలిపాడు.