Omar Abdullah: గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah shares Gujarathi Chocolate Sandwich making video
షార్ట్స్‌లో చూడండి
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో క్లిప్పింగ్ ను పంచుకున్నారు. అందులో గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ తయారుచేయడాన్ని చూపించారు. ఆ శాండ్ విచ్ ఎలా చేశారో చూశాక మతిపోయిందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 

"అసలు ఈ శాండ్ విచ్ తయారీకి ఉపయోగించిన పదార్థాల కాంబినేషన్ ను ఎవరు కనిపెట్టారో...? దీని అమ్మకాల సంగతేంటి?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను గుజరాతీ వంటకాలను విపరీతంగా ఇష్టపడతానని, కానీ ఈ చాక్లెట్ శాండ్ విచ్ కు అగ్రస్థానం ఇస్తానని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. 

కాగా, ఈ వీడియోలో ఓ హృదయాకరంలో ఉన్న బ్రెడ్, బటర్, జామ్, డెయిరీ మిల్క్ చాక్లెట్ తురుము, చీజ్ తురుము, చాకోబార్ పై భాగంలో ఉండే చాక్లెట్ ను ఉపయోగించి శాండ్ విచ్ తయారు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Omar Abdullah
Chocolate Sandwich
Gujarath
Jammu And Kashmir

More Telugu News