గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం
- రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ డిక్లరేషన్
- అర్హత పరీక్ష పాసై ఉండాలంటూ కండీషన్
- డిక్లరేషన్ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు
- ప్రొబేషన్ పూర్తి అయిన వారి వేతనాలు పెంచుతూ మరో కీలక నిర్ణయం
రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని పరీక్ష ఉత్తీర్ణులైన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్‌ను ఖరారు చేస్తూ కూడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీల పే స్కేల్‌ను రూ.23,120 నుంచి రూ.74,770కు, ఇతర సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను రూ.22,460 నుంచి రూ.72,810 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.