నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియామకం
- నీతి ఆయోగ్ కు కొత్త సీఈవో
- రెండేళ్ల పాటు కొనసాగనున్న అయ్యర్
- ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్
- ఈ నెల 30తో ముగియనున్న అమితాబ్ పదవీకాలం
ఈ నేపథ్యంలో, కొత్త సీఈవో నియామకం చేపట్టారు. పరమేశ్వరన్ అయ్యర్ ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరమేశ్వరన్ అయ్యర్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మోదీకి ఇష్టమైన స్వచ్ఛ్ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో అయ్యర్ కృషి ప్రశంసలందుకుంది.