ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

  • డాక్టర్ కృష్ణతేజతో డాక్టర్ పల్లవి వివాహం
  • నేడు మంగళగిరిలో రిసెప్షన్
  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
విశ్రాంత ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం.మాలకొండయ్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె డాక్టర్ పల్లవి వివాహం ఇటీవల డాక్టర్ కృష్ణతేజతో జరిగింది. వీరి పెళ్లి రిసెప్షన్ నేడు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరయ్యారు. వధూవరులు డాక్టర్ పల్లవి, డాక్టర్ కృష్ణతేజలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారికి తన ఆశీస్సులు అందించారు. 

CM Jagan
Punam Malakondaiah
Daughter
Wedding Reception

More Telugu News