JEE Main: ఈ నెల 23 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు... హాల్ టికెట్ల విడుదల

  • జేఈఈ మెయిన్ పరీక్షలకు రంగం సిద్ధం
  • ఈ నెల 23 నుంచి 29 వరకు పరీక్షలు
  • దేశంలో 501 నగరాల్లో పరీక్షలు
  • విదేశాల్లోని 21 నగరాల్లోనూ జేఈఈ
JEE Main will commence from June 23

జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో, మొదటి విడత హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దేశంలో 501 నగరాలతో పాటు, విదేశాల్లోని 21 నగరాల్లో జేఈఈ మెయిన్ నిర్వహిస్తుండడం విశేషం. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అన్ని ఏర్పాట్లు చేసింది. 

జేఈఈ పరీక్షలపై ఎన్టీయే స్పందిస్తూ... హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అంశంలో ఏవైనా సమస్యలు తలెత్తితే 011-40759000 ఫోన్ నెంబరులో గానీ, jeemain@nta.ac.in మెయిల్ ద్వారా గానీ సంప్రదించాలని సూచించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనా లక్షణాలు లేవని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

More Telugu News