హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన దీపికా పదుకొణె
- 'ప్రాజక్ట్ కె' సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్లిన బాలీవుడ్ భామ
- ముంబై విమానాశ్రయం వెలుపల దర్శనం
- ఆరెంజ్ సూట్ లో తళుక్కుమన్న దీపిక
హైదరాబాద్ లో షూటింగ్ సందర్భంగా కరోనా అనంతరం సమస్యల కారణంగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యింది. అనంతరం షూటింగ్ లో పాల్గొంది. ఎట్టకేలకు ఆమె ముంబై చేరుకుంది. ఆరెంజ్ రంగు షర్ట్, ఆరెంజ్ ప్యాంట్, కళ్లకు పెద్ద సైజు నల్లద్దాలతో ముంబై విమానాశ్రయం వెలుపల దర్శనం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్క్ ధరించి లేదు. తన కోసం వచ్చిన కారు ఎక్కేసి ఇంటికి వెళ్లిపోయింది.