హైదరాబాదులో వర్షం... రాగల రెండ్రోజులు కూడా వానలే!
- నిన్న రాత్రి కూడా హైదరాబాదులో వాన
- ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
- రహదారులపై నీళ్లు
- పొంగిపొర్లిన నాలాలు
- ఇబ్బందిపడిన వాహనదారులు
రహదారులపై నీళ్లు నిలవగా, కొన్నిచోట్ల నాలాలు పొంగిపోర్లాయి. దాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా, రుతుపవనాలు, ఉపరితలద్రోణి ప్రభావంతో మరో రెండ్రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.