ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదిగో!
- ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలు
- కౌలురైతు భరోసా యాత్ర చేపడుతున్న పవన్
- ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం
- రేపు పర్చూరులో సభ
గుంటూరు జిల్లా మీదుగా పర్చూరు చేరుకుంటారని, పర్చూరులో సభ ఉంటుందని తెలిపింది. పవన్ కల్యాణ్ రేపు ఉదయం 11 గంటలకు ఏటుకూరు చేరుకుంటారు. 11.30 గంటలకు చిలకలూరిపేట చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాలెం జంక్షన్ లో ప్రవేశిస్తారు.
అక్కడి నుంచి డేగర్లమూడి, చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి, పెదజాగర్లమూడి మీదుగా పర్చూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పర్చూరు ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో జనసేన రైతు భరోసా యాత్ర సభలో పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు.