ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ వాయిదా పడలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
- సెట్స్ లో ఇటీవల హీరోయిన్ దీపికకు అస్వస్థత
- చికిత్స చేయించుకొని గంటల్లోనే తిరిగొచ్చిన నటి
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
సినిమా చిత్రీకరణలో భాగంగా ఈ మధ్య హీరోయిన్ దీపికా పదుకొణే అస్వస్థతకు గురైంది. ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకోవడంతో ఆమె వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంది. అప్పటి నుంచి షూటింగ్ వాయిదా పడిందన్న పుకార్లు వస్తున్నాయి. కానీ, వీటిలో నిజం లేదని నిర్మాత అశ్వనీదత్ అన్నారు. షూటింగ్ ఆగిపోలేదని, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అంతా సజావుగానే జరుగుతోందని స్పష్టం చేశారు.
చికిత్స తర్వాత కొన్ని గంటల్లోనే దీపిక సెట్స్ కు తిరిగొచ్చిందట. ప్రస్తుతం దీపిక, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని, ఈ నెల 21వ తేదీ నుంచి పది రోజుల షెడ్యూల్ లో ప్రభాస్ కూడా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.