అగ్నిపథ్ మన దేశంలోనే అతి పెద్ద రిక్రూట్ మెంట్ పథకం: నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్
- అగ్నిపథ్ రూపొందించిన ప్రణాళిక బృందంలో నేను కూడా సభ్యుడినే
- అగ్నిపథ్ కోసం ఏడాదిన్నర పని చేశాను
- నాలుగేళ్ల తర్వాత సాయుధ బలగాల్లో చేరే అవకాశం ఉంటుంది
అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరిన వారు ఆ తర్వాత సాయుధ బలగాల్లో చేరే అవకాశం ఉంటుందని హరికుమార్ తెలిపారు. ఇంతకు ముందు సాయుధ బలగాల్లో ఒక్కరు పని చేసే చోట... ఈ పథకం వల్ల నలుగురికి అవకాశం లభిస్తుందని చెప్పారు. నాలుగేళ్లు సైన్యంలో పని చేసిన తర్వాత ఎన్నో అవకాశాలు ఉంటాయని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాలలో ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని తెలిపారు.