Nagababu: ప్రతిదానికీ ఈ కంగారేంటండీ రాంబాబు గారూ!: నాగబాబు

  • ఆత్మకూరు ఉప ఎన్నికపై అంబటి రాంబాబు ట్వీట్
  • బీజేపీకి జనసేన మద్దతు ఉందా అంటూ ప్రశ్నాస్త్రం
  • గెటప్ శీను గుర్తొస్తున్నాడన్న నాగబాబు
  • మీరూ, మీ అపరిపక్వత అంటూ విమర్శలు
Nagababu replies Ambati Rambabu tweet

ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు ఉందా? లేదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. స్పష్టంగా చెప్పకపోయారా... రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతారు అని హెచ్చరించారు. 

దీనిపై నాగబాబు బదులిస్తూ... 'అయినా ప్రతిదానికీ ఆ కంగారేంటండీ రాంబాబు గారూ' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 'రాంబాబు గారూ... మిమ్మల్ని చూస్తుంటే జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గెటప్ శీను గాడు గుర్తొస్తున్నాడు సుమీ' అంటూ ఎద్దేవా చేశారు. 'అయినా ఈ శాపనార్థాలేంటండీ బాబూ... మీరూ, అపరిపక్వత కాకపోతేనూ' అంటూ నాగబాటు ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

More Telugu News